Header Banner

తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత హల్‌చల్‌.. 12 ఏళ్లలోపు చిన్నారులను.!

  Sun May 25, 2025 22:30        India

అలిపిరి (Alipiri) కాలిబాట మార్గంలో ఇవాళ (ఆదివారం) రాత్రి సమయంలో చిరుత (Leopard) హల్‌చల్‌ చేసింది. కాలిబాట మార్గంలోని 350వ మెట్టు సమీపంలో భక్తులకు చిరుత కనిపించింది. చిరుతను చూసి భయంతో భక్తులు పరుగులు తీశారు. సమీపంలోని భద్రతా సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు. చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా భద్రతా సిబ్బంది పంపిస్తున్నారు. ఓ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు మెగాఫోన్ పంపించి గోవింద నామాలు జపిస్తూ భక్తులు కొండపైకి వెళ్తున్నారు. మెగా ఫోన్ ద్వారా వచ్చే అధిక శబ్దానికి చిరుత భయపడి అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు (TTD) భక్తుల భద్రతను కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. భక్తులు గుంపులుగా మాత్రమే కొండపైకి వెళ్లాలని, 12 ఏళ్లలోపు చిన్నారులను ఈ మార్గంలో అనుమతించకూడదని సూచించారు. ఇటీవల కాలంలో అలిపిరి మార్గంలో చిరుతల సంచారం పెరిగింది. చిన్నారులపై చిరుత దాడిచేసిన ఘటనలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు, అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ ద్వారా చిరుత సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #DharmaReddy #BhumanaKarunakarReddy #TDP #Case